బాబు జగ్జీవన్ రావు గొప్ప మానవీయ విలువలకు ప్రతిరూపం..

Babu Jagjivan Rao is an embodiment of great human values.– వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు..
నవతెలంగాణ –  డిచ్ పల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ యూనివర్సిటీ లో బాపు జగ్జీవన్ రావ్  జయంతి ఉత్సవాలను  ఘనంగా నిర్వహించాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు పేర్కొన్నారు. బుదవారం వైస్ ఛాన్సలర్ ఛాంబర్ లో బాబు జగ్జీవన్ రావు  జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని  తెలంగాణ యూనివర్సిటీలో   భారత సమ్మిళిత వృద్ధి  అనే అంశంపై ఈనెల 5 న  నిర్వహించే  ఒకరోజు సెమినార్  బ్రోచర్ను   వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి,  ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ్ మామిడాల, ఆడిట్ సెల్ డైరెక్టర్  ప్రొఫెసర్ గంట చంద్రశేఖర్, బీసీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ సిహెచ్ ఆరతి, ఎస్సీ సెల్ డైరెక్టర్, డాక్టర్ వాణి, విమెన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ బ్రమరాంబిక లు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వైస్ – ఛాన్సలర్ మాట్లాడుతూ బాపు జగ్జీవన్ రావ్  మానవీయ విలువలకు ప్రతిరూపమని,అట్టడుగు వర్గాల అభ్యున్నతికి  కృషి చేస్తూ పారదర్శకమైన పరిపాలన అందించిన బాపు జగ్జీవన్ రావ్  చిరస్మరణీయులని పేర్కొన్నారు.
Spread the love