హరిక్రిష్ణ గౌడ్ కు మద్దతుగా బహుజన సమాజ్ పార్టీ..

Bahujan Samaj Party in support of Harikrishna Goud.నవతెలంగాణ – మల్హర్ రావు
త్వరలో జరగనున్న మెదక్, అదిలాబాద్, నిజామబాద్, కరీంనగర్ పట్టబద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గౌడ్ ను బలపర్చిన సమాజ్ వాజ్ పార్టీ బలపర్చిన  టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి యటకారి సాయన్న ముదిరాజ్ పట్టభద్రుల ఓటర్లు  టీచర్స్ ఓటర్లు మొదటి ప్రాధన్యత ఓటువేసి గెలిపించలని బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు నర్ల గోపాల్ యాదవ్ కోరారు ఆదివారం మండల కేంద్రంలో మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వ్యక్తి, పేదవర్గల నుండి ఎదిగిన విద్యావంతుడు, మేధావి, బహుజన బిడ్డ, తన 19సంవత్సరల అసిస్టెంట్ ప్రొపెసర్ ఉద్యోగాన్ని వదలి నిద్యోగులగొంతు, శాసన మండలిలో బలంగావినిపించారని తెలిపారు. ప్రభుత్వాన్ని  నిలదీసి నిరుద్యోగుల సమస్యలు పరిస్కారంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం మెరుగైన విద్యావిధానం కోసం, బడ్జెట్ కేటాయించేలా శాసనమండలిలో గళం వినిపించేందుకు నిరుద్యోగుల పక్షాన అండగా పోరాటం చేయడానికి పట్టభద్రుల ఎమ్మెస్ల్సి బరిలోఉన్న ప్రసన్న హరికృష్ణకు  మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు. విద్యను కార్పొరేట్ చేసి వ్యాపారంచేస్తూ ఆస్తులు సంపాదించుకోడానికి కొందరు ఎమ్మెల్సీగా కొందరు విద్యాసంస్థల యజమానులు పోటీ చేస్తున్నారని వారు స్వార్ధ ప్రయోజనాల పరమావధిగా భావించే వ్యక్తులను ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ క్రార్యక్రమంలో బీఎస్పీ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు గోట్టె రాజు, పెద్దపల్లి జిల్లా ప్రధానకార్యదర్శి కాంపెల్లి బాబు, పెద్దపల్లి నియెజకవర్గ అధ్యక్షులు బోంకురి దుర్గయ్య, ప్రధానకార్యదర్శి సాతురి అనిల్, సుల్తానాబాద్ మండల అధ్యక్షులు బోయిని రంజిత్, రామీళ్ళ శారద పాల్గోన్నారు.
Spread the love