Tuesday, July 28, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పాత ఇనుప సామాను దుకాణంలో బ్యాలెట్ బాక్స్!

పాత ఇనుప సామాను దుకాణంలో బ్యాలెట్ బాక్స్!

- Advertisement -


​నల్లగొండ జిల్లా కేంద్రంలో వెలుగులోకి..
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా
బ్యాలెట్‌ ‌బ్యాక్స్‌గా గుర్తింపు

నవతెలంగాణ-నల్లగొండటౌన్
​​నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ పాత ఇనుప సామాను దుకాణంలో ఎన్నికల బ్యాలెట్‌ ‌బ్యాక్స్‌ కనిపించింది. కలెక్టర్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న శివగంగా పాత ఇనుప సామాను దుకాణంలో తెలంగాణ ఎన్నికల సంఘానికి చెందినట్టు కనిపిస్తున్న ఓ బ్యాలెట్ బాక్స్ ప్రత్యక్షమవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించే బ్యాలెట్ బాక్సులను సంబంధిత అధికారుల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరుస్తారు. అలాంటి బ్యాలెట్ బాక్స్ పాత ఇనుప సామాను దుకాణంలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. బాక్స్‌పై ఉన్న అక్షరాలను పరిశీలిస్తే అది జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన బ్యాలెట్ బాక్స్‌గా తెలుస్తోంది. అయితే ఇది స్ట్రాంగ్ రూమ్ నుంచి బయటకు ఎలా వచ్చింది? ఎన్నికల సంఘం అధికారికంగా పాత సామాను కింద వేలం వేసిందా? లేక మరే ఇతర మార్గంలో బయటకు చేరిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాక్స్‌ను కట్టర్‌తో కోసిన ఆనవాళ్లు కనిపించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీనిపై దుకాణ యజమానిని ప్రశ్నించగా.. మూడ్రోజుల కింద గుర్తు తెలియని వ్యక్తి ఈ బాక్స్‌ను తమకు విక్రయించాడని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -