Wednesday, June 17, 2026
E-PAPER
Homeజాతీయంటెలిగ్రామ్‌పై నిషేధం..కోర్టులో స‌వాల్

టెలిగ్రామ్‌పై నిషేధం..కోర్టులో స‌వాల్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్ నేప‌థ్యంలో కేంద్రం భారీ భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌రోసారి నీట్ పేప‌ర్ లీక్ కాకుండా క‌ట్టుదిట్ట‌మైన బందోబ‌స్తు క‌ల్పిస్తోంది. ఈక్ర‌మంలో టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలికంగా నిషేధం విధించారు. ఈ ఆంక్ష‌లు ఈనెల 22 వ‌ర‌కు అమ‌లో ఉంటాయి. తాజాగా ఈ నిర్ణ‌యాన్ని టెలిగ్రామ్ సంస్థ హైకోర్టులో స‌వాల్ చేసింది. ఈ మేర‌కు బుధ‌వారం టెలిగ్రామ్ కంపెనీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కారియా విచారించేందుకు అంగీకరించారు. ఇవాళే ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ చర్యను తాత్కాలిక భద్రతా చర్యగా పేర్కొంటోంది. పరీక్ష సజావుగా, మోసాలు లేకుండా నిర్వహించడమే లక్ష్యమని ఇటు ఎన్‌టీఏ స్పష్టం చేసింది. ఈ తరుణంలో ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -