మండల కేంద్రమైన మండల తహశీల్దార్ రవికుమార్ మండల ప్రజలకు సేవలందించి, ప్రతిభ కనబర్చిన నేపథ్యంలో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ,అదనపు కలెక్టర్ అశోక్ కుమార్,ఎస్పీ కిరణ్ కరే,భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ చేతులమీదుగా తహశీల్దార్ ప్రశంస పత్రాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో కాళేశ్వరం దేవస్థాన మాజీ డైరెక్టర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బండి రాజయ్య,మాలమహనాడు మంథని నియోజకవర్గ కోకన్వీనర్ లింగాల సురేష్ తహశీల్దార్ ను మర్యాదపూర్వక కలిసి శాలువాతో ఘంసంగా సన్మానించారు.