బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం దిష్టిబొమ్మ దహనం..

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
తన వ్యక్తిగత కుటుంబ లబ్దికోసం నమ్ముకున్న పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్న మాజీ శాసనసభాపతి బాన్సువాడ పోచారం శ్రీనివాస్ రెడ్డి దిష్టిబొమ్మను నసురుల్లాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బుధవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో బాన్సువాడ నయోజకవర్గం కాంగ్రెస్ పార్టీ చేరడంకు నిరసనగా నేడు నస్రుల్లాబాద్ గ్రామ బస్టాండ్ వద్ద పోచారం శ్రీనివాస్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాన్సువాడ నియోజకవర్గం పోచారంను వ్యతిరేకిస్తుందని. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి రాకూడదంటూ బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి నిరసన జ్వాలలు వెళ్ళబడుతున్నాయి. దీనితో  బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రతిపక్ష హోదాలో 6 నెలలు కూడా ఉండకుండా మళ్లీ అధికారం కోసం కాంగ్రెస్ లోకి చేరడానికి ఇలా ప్రయత్నిస్తున్నావని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. బాన్సువాడ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీకి ఏనుగుల రవీందర్ రెడ్డి సారధ్యమే తమ పార్టీకి అవసరమని అన్నారు.
30 ఏళ్లుగా బాన్సువాడ నియోజకవర్గం నాకు ఎమ్మెల్యేగా, మంత్రిగా, శాసనసభపతిగా పదవులు అనుభవించి, వెంట తిప్పుకున్న సీనియర్ నాయకులను తొక్కిపడేసి న పోచారం మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చి ఎవరిని తొక్కి పడేలాని చూస్తున్నావు అంటూ కాంగ్రెస్ నాయకులు పోచారం తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ లోకి చేరడాన్ని తాము వ్యతిరేకిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా వెల్లడించారు. అధికార బలం తో ఎంతోమంది సీనియర్ నాయకులను తెలుగుదేశంలో, భారత రాష్ట్ర సమితి పార్టీలో ఎదుగునివ్వకుండా, ఆధిపత్యం చెలాయిస్తూ మీ కుటుంబ సభ్యులను రాజకీయంలోకి తీసుకువచ్చి వారికి నియోజకవర్గాలను పంచి సామ్రాజ్యాన్ని చాటుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, మళ్లీ ఎందుకు నీకు అధికారం ఆశ పుట్టింది, కాంగ్రెస్ లోకి ఈ ముఖం పెట్టుకొని చేరుతావు అంటూ కాంగ్రెస్ నాయకులు పోచారం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందు పటేల్, శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ సాయిలు, శాంతయ్య, రాంబాబు, సాయ గౌడ్, సలీం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
Spread the love