
నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ పొద్దుటూరు సదానంద్ రెడ్డి గురువారం మృతి చెందారు.ఆర్మూర్ మండలం ఇస్సపల్లి గ్రామానికి చెందిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి లా పట్ఠాభద్రులై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని నిజామాబాద్ జిల్లా కోర్టు లో న్యాయవాదిగా యాబై ఏళ్లకు పైగా ప్రాక్టీస్ చేశారు. ఆయన మృతికి సంతాప సూచకంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంతాప సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం న్యాయవాదిగా పనిచేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతులకోసం న్యాయస్థానాలలో పలు సివిల్ దవాలు వేసి విజయం సాధించించారని తెలిపారు.రెడ్డి మృతికి రెండు నిమిషాలు మౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించినట్లు తెలిపారు.బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు ర్ కిరణ్ కుమార్ గౌడ్,తుల గంగాధర్ మాట్లాడారు. కార్యక్రమంలో బార్ ఉపాధ్యక్షుడు రాజు,కార్యదర్శి దొన్పల్ సురేష్, కోశాధికారి దీపక్, తదితరులు పాల్గొన్నారు.