బస్తీ సమస్యలు పరిష్కరిస్తా

– ఎమ్మెల్యే శ్రీ గణేష్‌ హామీ
– బస్తీలో పర్యటించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-కంటోన్మెంట్‌
కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలోని రెండో వార్డ్‌ శ్రీలంక బస్తీ సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామనిఎమ్మెల్యే శ్రీ గణేష్‌ బస్తీ వాసులకు హామీ ఇచ్చారు. శుక్రవారం బస్తీ వాసుల సమస్యల పరిష్కారం కోసం శ్రీలంక బస్తీలో సమా వేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే ఎమ్మెల్యే దష్టికి తీసుకుపోయారు. ముఖ్యంగా మంచినీరు, విద్యుత్‌ దీపాలు, రోడ్లు, ఇంకా సీసీ కెమెరాలు ఏర్పాటు విషయంపై వివరించారు. అంతకుముందు ఎమ్మెల్యే శ్రీలంక బస్తీలో తిరిగి సమస్యలను పరిశీలించారు.

Spread the love