నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూరు పట్టణంలో ఉన్న చైతన్య విద్యానికేతన్ పాఠశాల, సిద్ధార్థ విద్యాలయంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు బంతి పువ్వులు, గున్కపువ్వు, తంగెడపువ్వులతో బతుకమ్మను తయారుచేసి పాఠశాల ఆవరణలో పాటలు పాడుతూ బతుకమ్మ ఆటలు ఆడారు. అనంతరం పాఠశాల యాజమాన్యం విద్యార్థులతో కలిసి చెరువు వద్దకు వెళ్లి బతుకమ్మలను చెరువులో వేశారు. తెలంగాణలో సాంప్రదాయమైన పండుగ బతుకమ్మ పండుగ అని, ప్రతి ఒక్కరూ బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకోవాలని పాఠశాల యాజమాన్యం సూచించారు. ఈ కార్యక్రమంలో చైతన్య విద్యానికేతన్ పాఠశాల కరస్పాండెంట్ రేణు కుమార్, ప్రధానోపాధ్యాయులు అశోక్ యాదవ్, సిద్ధార్థ విద్యాలయం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.