నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ పట్టణంలోని నవభారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ , సెయింట్ జోసెఫ్ స్కూల్ లలో బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ముందస్తుగా బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత, కొంకటి నళిని దేవి, గోవింద రవి , గాదెపాక రవీందర్, స్కూల్ కరస్పాండెంట్ ప్రిన్సిపాల్ గంగరవేణి రవి, అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.