29న బవేజా స్టూడియోస్‌ ఐపీవో

29న బవేజా స్టూడియోస్‌ ఐపీవోహైదరాబాద్‌: పబ్లిక్‌ ఇష్యూకు రావడం ద్వారా రూ.97.20 కోట్లు సేకరించే యోచనలో ఉన్నట్లు చలన చిత్రాల ప్రొడక్షన్‌ సంస్థ బవేజా స్టూడియోస్‌ తెలిపింది. ఇందుకోసం ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ)కు వస్తున్నట్లు వెల్లడించింది. జనవరి 29న ఇష్యూ ప్రారంభమై ఫిబ్రవరి 1న ముగియనుంది. ఈ ఇష్యూలో రూ.10 ముఖ విలువ కలిగిన 54 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఒక్కో షేరు ధరల శ్రేణీని రూ.170-180గా నిర్ణయించింది. అప్లికేషన్‌ కొరకు కనీస లాట్‌ 800 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కనీస అప్లికేషన్‌ మొత్తం రూ.1.44 లక్షలుగా ఉంది. సమీకరించిన నిధులు వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాలు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగించనున్నట్లు వెల్లడించింది.

Spread the love