
నవతెలంగాణ- దుబ్బాక : అందమైన చేతిరాత ఒక కళ లాంటిదని.. మనసుపెట్టి నేర్చుకుంటే అది అందరికీ సాధ్యమవుతుందని మండల విద్యాధికారి జోగు ప్రభుదాస్ చెప్పారు.మంగళవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధి దుంపలపల్లి వార్డులోని జెడ్పీహెచ్ఎస్ లో ప్రముఖ చేతిరాత నిపుణుడు ఎజాజ్ అహ్మద్ చే విద్యార్థులకు చేతిరాతను మెరుగుపర్చుకోవడం పట్ల శిక్షణ కల్పించారు.” అందమైన చేతిరాత అందరికీ సాధ్యమే” అన్న పుస్తకం ద్వారా తెలుగు,హిందీ,ఇంగ్లీష్ భాషల్లో అందంగా ఎలా రాయాలో విద్యార్థులకు వివరించారు.ఈ సందర్భంగా ఎజాజ్ అహ్మద్ ను అలాగే పాఠశాలకు రూ.10 వేల ఆర్థిక సహకారాన్ని అందించిన బిజ్జ లక్ష్మణ్,బోయ రాములుకు ఎంఈఓ ప్రభుదాస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.పాఠశాల ఉపాధ్యాయ బృందం శ్రీనివాస్,మార్కండేయ,విద్యాసా గర్,రామచంద్రం,యాదగిరి,లీలారాణి ,రమేష్,అశోక్ ఉన్నారు.