లబ్దిదారులకు తులం బంగారం అందజేయాలి

– ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
– కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
నవతెలంగాణ-బేగంపేట
ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్దిదారులకు తులం బంగారం అందజేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బుధవారం బేగంపేటలోని తహసిల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కల్యాణ లక్ష్మి కింద 122, షాదీ ముబారక్‌ కింద 37 మందికి మొత్తం 159 మంది లబ్దిదారులకు ఆర్ధిక సహాయం చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడపడుచుల పెండ్లి కోసం ఆయా కుటుంబాలు పడుతున్న ఆర్ధిక ఇబ్బందులను దష్టిలో ఉంచుకొని వారికి అండగా నిలవాలనే ఆలోచనతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ కింద రూ. లక్ష 116 చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం ింద లక్షలా ది మంది ఆర్ధిక సహాయం పొందారని వివరించారు. అయితే అర్హులైన లబ్దిదారులకు ఆర్థిక సహాయంతో పాటు ఒక తులం బంగారం కూడా అందజేస్తామని అసెంబ్లీ ఎన్ని కల సమయంలో కాంగ్రెస్‌ ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్దిదారులకు తులం బంగారం కూడా అందించే విధంగా చర్యలు తీసుకోవా లన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ లు టి.మహేశ్వరి, కుర్మ హేమలత, సుచిత్ర, దీపిక, మాజీ కార్పొరేటర్‌ ఆకుల రూప, తహసీల్దార్‌ పాండు నాయక్‌ తదితరులు ఉన్నారు.

Spread the love