నవతెలంగాణ-హైదరాబాద్: బెంగాల్‌లో గత టీఎంసీ సర్కార్ ఇమామ్‌లు, ముఅజ్జిన్‌లు, ఆలయ పూజారులకు నెలవారీ గౌరవ వేతనం రూ.2500 అందించిన విషయం తెలిసిందే. తాజాగా సువేందు అధికారి నేతృత్వంలోని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మత ఆధారిత సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం సీఎం సువేందు అధికారి అధ్యక్షతన బెంగాల్ కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మత ఆధారిత సంక్షేమ పథకాలను నిలిపివేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. 2026, జూన్ నుంచి ఈ పథకాలు నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సంక్షేమ కార్యక్రమాలకు మతం రంగు పులమకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఘోర పరాజయం పాలైంది. దీంతో బెంగాల్ తొలి బీజేపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు సువేందు అధికారి.



