బెస్ట్ అవైలబుల్ పథకం లబ్ధిదారులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక..

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
2024-25 విద్యా సంవత్సరంలో గిరిజన సంక్షేమ శాఖ యందు బెస్ట్ అవైలబుల్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న గిరిజన విద్యార్థిని, విద్యార్థులకు ఈ నెల 12న ఉదయం 11.00 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం, సూర్యాపేటలోని సమావేశం మందిరం లో లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థిని,విద్యార్థులను ఎంపిక చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 31 సీట్లకు గాను 330 మంది విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది అని కావున ఇట్టి లాటరీ పద్ధతి కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థిని,విద్యార్థుల తల్లిదండ్రులు, ఆసక్తి గల ప్రజాప్రతినిధులు గిరిజన నాయకులు హాజరు కావాలని కలెక్టర్ కోరారు.
Spread the love