మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని జ్యోతిరావు పూలే విగ్రహకమిటి చైర్మన్ విజయగిరి సమ్మయ్య కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.జ్యోతిరావు పూలే198వ జయంతిని పురస్కరించుకుని మండలంలోని కొయ్యుర్ సెంటర్ లో పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడారు. పూలే దంపతులు బలహీనవర్గాల జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ పెరిగిన ఫూలే సమాజంలో మహిళపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడన్నారు. పూలే 1948లో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్కూలు ఏర్పాటు చేశారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా అందరికీ సమానంగా హక్కులు ఉండాలని పూలే పోరాటం చేశారన్నారు.వెనుకబడిన కులంలో పుట్టి చిన్నప్పుడు నుండి కష్టాలు ఎదుర్కొన్న పూలే సత్య శోధక్ సమాజ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు. బలహీన వర్గాల తరఫున పోరాడారని, సామాజిక అసమానతల మీద ఆలు పెరగని పోరాడి, అనగారిన వర్గాల విద్యాభివృద్ధి కోసం సమాజ స్థాపనకై కృషి చేసిన సంఘ సంస్కృత సామాజిక తత్వవేత్త మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలు కొనసాగించాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అయితే రాజిరెడ్డి,మహిళ అధ్యక్షురాలు కొండ రాజమ్మ ,రజక సంఘం మండల అధ్యక్షులు పావురాల ఓదెలు ,మున్నూరు కాపు మండల అధ్యక్షులు భద్రపు సమ్మయ్య కుల సంఘాల నాయకులు అజ్మీర సమ్మయ్య ,లకావత్ సవేందర్,పులిగంటి రాములు,బోయిని రాజయ్య ,కొండూరు మమత తిప్పల పాల్గొన్నారు.