కన్నపూర్ తండాలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ: కలెక్టర్

Bhoomi puja for Indiramma's houses in Kannapur Thanda: Collectorనవతెలంగాణ – రామారెడ్డి 

మండలంలోని కన్నాపూర్ తండాలో గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు. స్థానిక గ్రామస్తులు మాట్లాడుతూ… నీటి సమస్య ఇబ్బందిగా ఉందని, త్రాగునీటికి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇబ్బందిగా ఉందని, తాత ముత్తాతల నుండి గత 60, 70 సంవత్సరాల నుండి భూములు సాగు చేస్తున్నామని, ఫారెస్ట్ అధికారులు వ్యవసాయం చేయకుండా, బోర్లు వేయకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా ఫారెస్ట్ అధికారులతో మాట్లాడతానని తాండవాసులకు కలెక్టర్ సూచించారు. మహిళా సంఘాల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు స్థానికులు మద్దతు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులతో పాటు మండల ఎస్టీసెల్ అధ్యక్షులు గోవింద నాయక్, మాజీ ఉపసర్పంచ్ సర్మన్ నాయక్, గ్రామ అధ్యక్షులు శంకర్ నాయక్, గ్రామస్తులు మాన్సింగ్, లచ్చిరాం నాయక్, దరి సింగ్ నాయక్, జైలు, కొమ్మిరియా, గోవింద్ రెడ్డి, పరశురాం, తేజు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love