నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం కరపత్రాన్ని శనివారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి మండలం నందనం గ్రామంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు సురుపంగ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వికలాంగుల కనీస పెన్షన్ 5000లకు పెంచాలని, అంత్యోదయ రేషన్ కార్డ్స్, ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డ్స్ ఇచ్చి 200 రోజులు పని కల్పించాలని కోరారు. నిత్యావసర సరకుల ధరలు 300 రేట్లు పెరిగినవి. కానీ పెన్షన్స్ మాత్రం పెంచకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనీ, ధరల పెరుగుదల సూచికి పెన్షన్స్ అనుసంధానం చేయాలనారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఇందిరా గాంధీ జాతీయ వికలాంగుల పెన్షన్ పతకాన్ని వికలాంగులందరికి వర్తింపచేయాలనీ, రాజస్థాన్ రాష్ట్రం మాదిరిగా పెన్షన్ పొందడం వికలాంగుల హక్కుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలనారు. 2015 డిసెంబర్ 3న అర్బటంగా ప్రధాన మంత్రి ప్రారంభించిన సుగమ్య భరత్ అభియాన్ పథకం అమలు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు నిధుల కేటాయింపులో కేంద ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనారు. 2024 సంవత్సరo పూర్తివుతున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం.కేంద్ర ప్రభుత్వం అసమర్ధత వలన 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం, 2017మెంటల్ హెల్త్ కేర్ యాక్ట్,2007 ఐక్య రాజ్యా సమితి హక్కుల ఒప్పంద పత్రం,నేషనల్ పాలసీ, నేషనల్ ట్రస్ట్ వంటి కీలక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు.2016 ఆర్పిడి చట్టానికి సవరణ చేయడానికి విడుదల చేసిన గెజిట్ను రద్దు చేయాలనీ, .2016 ఆర్ పి డి చీఫ్ కమిషనర్,నేషనల్ ట్రస్ట్ కు 10 ఏండ్ల నుండి చైర్మన్స్ నియమించడం లేదనీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్స్ అందని ద్రాక్షగా మారుతున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదనారు. .కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ చేసేందుకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయాలి.ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటికరణ వలన వికలాంగులు రిజర్వేషన్ సౌకర్యం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందనారు. వివాహంతో సంబంధం లేకుండా వికలాంగులకు అంత్యోదయ అన్న యోజన కార్డులు జారీ చేయాలనీ కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులు రాయితీలను పొండెందుకు యు డి ఐ డి కార్డునే గుర్తింపుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ ఛైర్మెన్ పోతంశెట్టి వెంకటేష్ , జిల్లా నాయకులు పాక వెంకటేష్ యాదవ్ , మురళి , పాండాల శ్రీహరి, యాదగిరి, నరసయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.