నవతెలంగాణ – భువనగిరి
కంచ గచ్చిబౌలి భూమిని పరిశీలించడానికి వచ్చిన సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ మెంబర్ వినెయ్ లిమాయిని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురాం రెడ్డి ని హైదరాబాద్ లో కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వే నెం 25, కంచ గచ్చిబౌలి గ్రామం, సెరిలింగంపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా (ఏ 2,324-05 గుంటలు)లోని భూమి పూర్తిగా ప్రభుత్వ భూమి అని రెవెన్యూ రికార్డుల ప్రకారం, కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నెం.25లోని భూమి “కంచ అస్తబల్ పోరంబోకే సర్కారీ” అంటే ప్రభుత్వ భూమిగా నమోదైందని తెలిపారు. 1975లో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ ( యుఓహెచ్)కి కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నేం 25, ఇతర సర్వే నంబర్‌లలో ఉన్న మొత్తం భూమిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. పైన పేర్కొన్న భూమి అప్పుడూ అన్యాక్రాంతమైందన్నారు. యాజమాన్యం యుఓహేచ్ కి అనుకూలంగా బదిలీ చేయబడలేదన్నారు. రెవెన్యూ రికార్డు ప్రకారం మరియు అటవీ శాఖ ప్రకారం, సర్వనెంబర్ 25లోని భూమిని “అటవీ”గా వర్గీకరించలేదన్నారు.