భువనగిరి మున్సిపాలిటీ యాప్

నవతెలంగాణ – భువనగిరి
పౌర సేవలతో పాటుగా సెప్టిక్ ట్యాంక్లను ఖాళీ చేయించడానికి ప్రత్యేకమైన లింకును ఏర్పాటు చేస్తే  భువనగిరి మున్సిపల్ మున్సిపాలిటీ యాప్ పై మున్సిపల్ కమిషనర్ బి నాగిరెడ్డి ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా వర్క్ షాప్ లో అవగాహన కల్పించారు .  ఈ యాప్ లో ముఖ్యంగా పౌర సేవలతో పాటుగా సెప్టిక్ ట్యాంక్లను ఖాళీ చేయించడానికి ప్రత్యేకమైన లింకును అందుబాటులోకి తేవటం జరిగింది. ఈవిషయాన్ని సిబ్బందికి అందరికి తెలియజేసి, ప్రజలందరూ యాప్ ను డౌన్లోడ్ చేసుకునే విధంగా   ప్రచారం నిర్వహించాలన్నారు. ప్రజలకు ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు అట్టి యాప్ ద్వారా ఫిర్యాదును నమోదు  చేసుకోవచ్చు. సత్వరమైన సేవలు పొందటానికి వీలు కలుగుతుందని, అదేవిధంగా మునిసిపాలిటీ సేవలను పొందగలరని కమిషనర్ గారు తెలియజేయడం జరిగినది. ఇట్టి వర్క్ షాప్ ప్రతినిధులు  చిరంతన, ఓం ప్రకాష్, అవినాష్ ఎస్సై ప్రసాద్ దోసపాటి శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love