వేములవాడలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్..

– కాంగ్రెస్ పార్టీలో  చేరిన 22వ వార్డు కౌన్సిలర్..
నవతెలంగాణ – వేములవాడ
బీఆర్ఎస్ పార్టీకి చెందిన 22వ వార్డు కౌన్సిలర్ ఇప్పప్పుల అజయ్ ఆదివారం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్. పార్లమెంట్ ఎన్నికల ముందు వేములవాడ బీఆర్ఎస్  పార్టీ కి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.వేములవాడ మున్సిపల్ 22 వ వార్డు బీఆర్ఎస్  కౌన్సిలర్  ఇప్పపూల అజయ్  ప్రభుత్వ విప్,వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ , అసెంబ్లీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, బింగి మహేష్, ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ పుల్కం రాజు, తుమ్ మధు, చిలుక రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love