‘కల్కి’ సెకండ్ పార్ట్ గురించి బిగ్ అప్ డెట్..

నవతెలంగాణ-హైదరాబాద్ : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటించిన సినిమా కల్కి. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ చిత్రం థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబడుతుంది. ‘కల్కి’ మూవీ బ్లాక్ బస్టర్ కావడంపై నిర్మాత అశ్వనీదత్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే సెకండ్ పార్ట్ కు సంబంధించిన 60శాతం షూటింగ్ పూర్తయినట్లు అశ్విని దత్ తెలిపారు. కొన్ని మేజర్ పోర్షన్స్ షూట్ చేయాల్సి ఉందని అన్నారు. రిలీజ్ తేదీని ఇంకా ఫిక్స్ చేయలేదని అశ్విని దత్ అన్నారు.కాగా, ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, పశుపతి , రాజేంద్ర ప్రసాద్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు.ఈ సంవత్సరం అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా కల్కి రికార్డు క్రియేట్ చేసింది.

Spread the love