PB201 బ్యాచ్ పరీక్షా ఫలితాల్లో వ్యత్యాసాలపై సమీక్ష చేపట్టాలని బిస్లరీ డిమాండ్

54 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఆదేశాల మేరకు, బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్యాచ్ PB201ను ఇప్పటికే వెనక్కి తీసుకుంది. 2026 ఆగస్టు 12న FSSAI ఈ బ్యాచ్ విక్రయాలపై నిషేధం విధించింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిగురి జిల్లా, టెలిపారాలో ఉన్న బిస్లరీ ఉత్పత్తి కేంద్రంలో ఈ బ్యాచ్‌ను తయారు చేశారు.

ప్రాథమిక, రిఫరల్ ప్రయోగశాలలు నిర్వహించిన పరీక్షల్లో నియంత్రణ నమూనాలో కోలిఫాం బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించాయి.

అయితే, బిస్లరీ సంస్థ అదే బ్యాచ్‌కు చెందిన నమూనాలను FSSAI గుర్తింపు పొందిన ప్రయోగశాలలో స్వతంత్రంగా పరీక్షించగా, వాటిలో కోలిఫాం బ్యాక్టీరియా ఉనికి లేదని, అలాగే ఇతర ఆహార భద్రతా ప్రమాణాలకు కూడా అవి అనుగుణంగా ఉన్నాయని పరీక్షల్లో వెల్లడైంది.


బిస్లరీ సంస్థ అదే బ్యాచ్‌కు చెందిన నమూనాలను FSSAI గుర్తింపు పొందిన మరో స్వతంత్ర ప్రయోగశాలలో పరీక్షించగా, కోలిఫాం బ్యాక్టీరియాకు సంబంధించి నిర్దేశించిన భద్రతా ప్రమాణాలకు అవి అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారణైంది.


నియంత్రణ సంస్థ, స్వతంత్ర ప్రయోగశాలలు నిర్వహించిన పరీక్షల ఫలితాల మధ్య వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో, ఈ అంశంపై సమగ్ర సమీక్ష చేపట్టాల్సిన అవసరం ఉందని బిస్లరీ పేర్కొంది. నమూనాల సేకరణ ప్రక్రియ, పరీక్షా విధానాలు, ప్రయోగశాలల నివేదికలు, అలాగే ఫలితాల్లో వ్యత్యాసానికి కారణమై ఉండే ఇతర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని FSSAIని కోరింది.

పరిశ్రమలోని అన్ని సంస్థలకు వర్తించే ఒకే విధమైన ప్రమాణాల ఆధారంగా ఈ అంశాన్ని నిష్పక్షపాతంగా పరిశీలిస్తారని బిస్లరీ ఆశిస్తోంది. వాస్తవాలను వెలికితీసేందుకు FSSAIకి అన్ని విధాలా పూర్తి సహకారం అందిస్తామని సంస్థ స్పష్టం చేసింది.


వినియోగదారులకు సురక్షితమైన తాగునీటిని అందించడమే బిస్లరీ సంస్థ యొక్క ప్రధాన ప్రాధాన్యత. ఇందుకోసం పది దశల తయారీ ప్రక్రియలో భాగంగా 90కి పైగా నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తూ, అత్యంత కఠినమైన నాణ్యతా నియంత్రణ ప్రమాణాలను అనుసరిస్తోంది. నాణ్యత, భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా సురక్షితమైన తాగునీటిని అందించడం పట్ల సంస్థ కట్టుబడి ఉంది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్