Magazines

నాణ్యత, భద్రత, సుస్థిరతకు సంబంధించి నాలుగు ఐఎస్ఓ ధ్రువీకరణలను పొందిన వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ

2 గంటల క్రితం

Vedanta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : నాణ్యత , పర్యావరణ నిర్వహణ, వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రత, ఇంధన నిర్వహణ విభాగాల్లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌లోని వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ (ఎంఈఎల్)  నాలుగు  ఐఎస్ఓ ధ్రువీకరణలను సాధించింది. ఈ విజయంతో ప్లాంట్ కార్యకలాపాలకు సంబంధించిన నాలుగు కీలక అంశాలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిర్వహణ వ్యవస్థల పరిధిలోకి వచ్చాయి. తద్వారా ప్రక్రియల నిర్వహణ, పని ప్రదేశాల్లోని ప్రమాదాల నియంత్రణ, పర్యావరణ బాధ్యతలు, ఇంధన వినియోగం వంటి అంశాలను నిర్వహించే విధానం మరింత బలోపేతం కానుంది.

ఈ ధ్రువీకరణల్లో నాణ్యత నిర్వహణకు ISO 9001:2015, పర్యావరణ నిర్వహణకు ISO 14001:2015, వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రతకు ISO 45001:2018, ఇంధన నిర్వహణకు ISO 50001:2018 ఉన్నాయి. మొదటి మూడు ధ్రువీకరణలు సమగ్ర నిర్వహణ వ్యవస్థ (IMS) పరిధిలోకి రాగా, ISO 50001:2018 ఇంధన నిర్వహణ వ్యవస్థ (EnMS) పరిధిలోకి వస్తుంది. గ్యాప్ అసెస్‌మెంట్లు, నిర్వహణ విధానాల ప్రామాణీకరణ, రిస్క్ సమీక్షలు, ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాల సమగ్ర కసరత్తు అనంతరం ఈ ధ్రువీకరణలను అందించారు..

వేదాంత పవర్ లిమిటెడ్ సిఈఓ , హోల్‌టైమ్ డైరెక్టర్ రాజిందర్ సింగ్ అహుజా మాట్లాడుతూ, “ బలమైన భద్రతా సంస్కృతి అనేది పటిష్టమైన ఇంధన వ్యాపారాన్ని నిర్మించడానికి ప్రాథమిక అవసరమని వేదాంత పవర్‌ వద్ద  మేము విశ్వసిస్తున్నాము . మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ సాధించిన ఈ నాలుగు ఐఎస్ఓ ధ్రువీకరణలు మా కార్యకలాపాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను అమలు చేయాలనే మా నిబద్ధతను మరింతగా వెల్లడిస్తుంది. ఇండియా తమ ఇంధన లక్ష్యాల దిశగా ముందుకు సాగుతున్న తరుణంలో, విశ్వసనీయమైన విద్యుత్ ఉత్పత్తికి తోడ్పడటంతో పాటు భద్రత, బాధ్యతాయుతమైన వృద్ధిలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పే సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై మా దృష్టి కొనసాగుతుంది” అని అన్నారు.

వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ సిఈఓ బిను రాఫెల్ మాట్లాడుతూ, “ఈ ధ్రువీకరణలు ప్లాంట్ రోజువారీ కార్యకలాపాల్లో మేము తీసుకొస్తున్న క్రమశిక్షణకు, కచ్చితత్వానికి నిదర్శనం. భద్రతా విధానాలను బలోపేతం చేయడం, కార్యకలాపాల్లోని ప్రమాదాలను నిర్వహించడం నుంచి పర్యావరణ, ఇంధన పనితీరును మెరుగుపరచడం వరకు ఈ ప్రమాణాలు క్షేత్రస్థాయిలో నిరంతరం అమలయ్యేలా చూడటమే మా లక్ష్యం. ఈ విజయాన్ని సాధించడంలో మా బృందాలు, వ్యాపార భాగస్వాముల సమష్టి కృషి కీలక పాత్ర పోషించింది” అని పేర్కొన్నారు.

ISO 45001:2018 ధ్రువీకరణ, పని ప్రదేశాల్లో భద్రతకు సంబంధించి  ఎంఈఎల్ ఇప్పటికే అనుసరిస్తున్న విధానాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఇప్పటికే అమల్లో ఉన్న భద్రతా పద్ధతులను అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రతా అవసరాలకు అనుగుణంగా తీసుకువచ్చింది. క్రిటికల్ రిస్క్ మేనేజ్‌మెంట్, HAZOP మరియు LOPA అధ్యయనాల మద్దతుతో, GEMBA సేఫ్టీ వాక్స్ మరియు విజిబుల్ ఫెల్ట్ లీడర్‌షిప్ (VFL) వంటి నాయకత్వ-ఆధారిత కార్యక్రమాలలో ఇది ప్రతిబింబిస్తుంది. సురక్షా సంకల్ప్, సురక్షా బంధన్ వంటి కార్యక్రమాలు, కాంట్రాక్టర్ల భాగస్వామ్యం, కార్మికుల శిక్షణ, అత్యవసర ప్రతిస్పందన డ్రిల్స్‌తో పాటు, ఈ ప్రమాణాలను ప్లాంట్, దాని పొరుగు కమ్యూనిటీల అంతటా స్థిరమైన భద్రతా పద్ధతులుగా మరింతగా అమలు చేస్తాయి.

ఎంఈఎల్ పర్యావరణ, ఇంధన నిర్వహణ ప్రయత్నాల్లో ఫ్లై యాష్ వినియోగం, జీవవైవిధ్య అభివృద్ధి, మొక్కల పెంపకం, పర్యావరణ పర్యవేక్షణను మెరుగుపరచడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలు భాగంగా ఉన్నాయి. ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించే చర్యల్లో గణనీయమైన ఇంధన వినియోగ ప్రాంతాల (SEUs) పర్యవేక్షణ, ఇంధన పనితీరు సూచికల (EnPIs) ట్రాకింగ్, సహాయక విద్యుత్ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడం, పరికరాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలు ఉన్నాయి.

ఈ ధ్రువీకరణల సాధనలో MELకు చెందిన HSE, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్, అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్లానింగ్, ఎనర్జీ మేనేజ్‌మెంట్, క్వాలిటీ అష్యూరెన్స్, హెచ్ ఆర్ , ప్రొక్యూర్‌మెంట్, సెక్యూరిటీ విభాగాలతో పాటు వ్యాపార భాగస్వాములు సమన్వయంతో కృషి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్