Magazines

ఆఫర్లను అందించేందుకు హోటళ్లు, హోమ్‌స్టేలు, విమానయాన సంస్థలు, బ్యాంకులతో MakeMyTrip చేతులు కలిపాయి

2 గంటల క్రితం

MakeMyTrip
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 3 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తమ సంవత్సరాంతపు సెలవులను ప్లాన్ చేసుకుంటున్న ప్రయాణికుల కోసం, ‘ట్రావెల్ కా ముహూరత్ సేల్’ రెండో ఎడిషన్‌ నవంబర్ 14 నుండి ప్రారంభం కానున్నట్లు MakeMyTrip నేడిక్కడ ప్రకటించింది. ఇందులో పాల్గొంటున్న భాగస్వాములలో హోటల్ చైన్‌లు, రిసార్ట్‌లు, స్వతంత్ర హోటళ్లు, హోమ్‌స్టే లు, విల్లాలతో సహా 30,000కు పైగా దేశీయ, 3500కు పైగా అంతర్జాతీయ వసతి కేంద్రాలు, 35 దేశీయ,  అంతర్జా తీయ విమానయాన సంస్థలు, 8 బ్యాంకులు ఉన్నాయి (నవంబర్ 11, 2026 నాటికి).  

సంవత్సరాంతపు ప్రయాణాలలో తరచుగా ధరల ఆందోళన ఉంటుంది. ఎందుకంటే డిసెంబర్‌లో పెరిగే ధరలు, పరిమిత లభ్యత గురించి ప్రయాణికులు ఆందోళన చెందుతారు. ‘ట్రావెల్ కా ముహూరత్ సేల్’ వారికి ముందు గానే ప్లాన్ చేసుకోవడానికి, విశ్వాసంతో బుక్ చేసుకోవడానికి ఒక ప్రత్యేక బుకింగ్ విండోను అందిస్తుంది. ఇందు లో విమానాలు, హోటళ్లు, హోమ్‌స్టేలు, హాలిడే ప్యాకేజీలు, బస్సులు, క్యాబ్‌లు, రైళ్లు, టూర్స్ అండ్ అట్రాక్షన్స్, ఫారెక్స్,   వీసా సేవలపై డీల్స్ ఉంటాయి

ఈ ఆఫర్లు కూర్గ్, అండమాన్, లక్షద్వీప్, జమ్మూ & కశ్మీర్, కేరళ, రాజస్థాన్, ఈశాన్య ప్రాంతం, గోవా వంటి దేశీయ ప్రసిద్ధ ప్రదేశాల నుండి, జపాన్, దుబాయ్, మలేషియా, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం, శ్రీలంక, యూకే, మిగిలిన యూరప్ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాల వరకు స్వల్ప, సుదూర ప్రయాణాలను కవర్ చేస్తాయి. ఫెరారీ వరల్డ్ (యూఏఈ), యూనివర్సల్ స్టూడియోస్ (సింగపూర్), మేడమ్ టుస్సాడ్స్ (సింగ పూర్), మందాయ్ వైల్డ్‌లైఫ్ గ్రూప్ – నైట్ సఫారీ, సింగపూర్ జూ (సింగపూర్),  సన్ వరల్డ్ బా నా హిల్స్ (వియ త్నాం) వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ ఆకర్షణలు కూడా ఈ ప్రచార కార్యక్రమం కోసం చేతులు కలిపాయి.

MakeMyTrip కార్పొరేట్, ఫ్లైట్స్, జీసీసీ, మార్కెటింగ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజ్ రిషి సింగ్ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలోని కొనుగోలుదారులు పండుగ అమ్మకాల కోసం ఎదురుచూస్తుంటారు. ప్రయాణానికి కూడా ఒక ప్రత్యేక ప్రణాళికా సీజన్ ఉండాలని మేం నమ్ముతున్నాం. ఈ రెండో ఎడిషన్‌తో,  మరో అమ్మకం అనే స్థాయిని దాటి, భారతదేశ ప్రయాణికులకు సెలవుల గురించి ఆలోచించడం నుండి వాటిని బుక్ చేసుకునే వరకు ముందు కు వెళ్లే విశ్వాసాన్ని ఇవ్వడమే మా లక్ష్యం. 'ట్రావెల్ కా ముహూరత్ సేల్' క్యాలెండర్‌లో ఒక స్థిరమైన తేదీగా మారా లని మేం కోరుకుంటున్నాం. ఆ తేదీన ప్రయాణికులు అనేక రకాల ఆదాలతో తమ సంవత్సరాంతపు విహార యాత్రను ప్లాన్ చేసుకోవచ్చని వారికి తెలియాలి, మా భాగస్వాములు పీక్ సీజన్ డిమాండ్‌ను ముందు గానే గుర్తించి దానికి సిద్ధం కావాలి” అని అన్నారు.

సేల్‌ను ప్రకటించడానికి MakeMyTrip తమ బ్రాండ్ ప్రచారకర్తలు ఆలియా భట్, రణవీర్ సింగ్ నటించిన ఆరు చిత్రాలతో కూడిన కొత్త ప్రచారాన్ని ఆవిష్కరించింది. ఈ క్యాంపెయిన్ దేశీయ, అంతర్జాతీయ విమానాలు, దేశీయ, అంతర్జాతీయ హోటళ్లు, విల్లాలు, అపార్ట్‌మెంట్లు, హాలిడే ప్యాకేజీలు, అవుట్ స్టేషన్ క్యాబ్‌ల వరకు సేల్‌లోని విభిన్న భాగాలను హైలైట్ చేస్తుంది. దీన్ని ‘టాలెంటెడ్’ అనే క్రియేటివ్ ఏజెన్సీ రూపొందించింది.

MakeMyTrip లాయల్టీ ప్రోగ్రామ్ MMTBLACK సభ్యులు నవంబర్ 13న జరిగే ఎర్లి సేల్‌ కు ముందస్తు యాక్సెస్ పొందుతారు. ప్రతి శుక్రవారం, ఈ క్యాంపెయిన్ ప్రత్యేకంగా MMTBLACK సభ్యుల కోసం బ్లాక్ ఫ్రైడే డీల్స్‌ను అందిస్తుంది. రోజువారీ లైట్నింగ్ డ్రాప్స్ సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల మధ్య అందరు వినియోగదారుల కోసం పరిమిత ఇన్వెంటరీ డీల్స్‌ను విడుదల చేస్తాయి.

MakeMyTrip ఈ ఏడాది ప్రారంభంలో హోటళ్లు, హోమ్‌స్టేల కోసం ప్రవేశపెట్టిన గ్లోబల్ రివార్డ్ ప్రోగ్రామ్ ‘వన్ సర్కిల్’ ఈ సేల్ సమయంలో బుకింగ్‌లు చేసుకునే సభ్యులకు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.

 భాగస్వామ్య బ్రాండ్‌లలో కొన్ని ఇవి:

·       విమానయాన సంస్థలు: ఎయిర్ ఫ్రాన్స్, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాసా ఎయిర్, బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఎతిహాద్ ఎయిర్‌వేస్, ఇండిగో, లుఫ్తాన్సా, ఖతార్ ఎయిర్‌వేస్, సింగపూర్ ఎయిర్‌ లై న్స్, స్విస్, టర్కిష్ ఎయిర్‌లైన్స్, వర్జిన్ అట్లాంటిక్ వంటి దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు.

·       హోటళ్లు: బ్లూమ్ హోటల్స్, క్లబ్ మహీంద్రా, జింజర్ హోటల్స్, జిఆర్‌టి హోటల్స్ & రిసార్ట్స్, ఐటిసి హోట ల్స్, కామత్ హోటల్స్, లీజర్ హోటల్స్ గ్రూప్, లెమన్ ట్రీ హోటల్స్, లార్డ్స్ హోటల్స్ & రిసార్ట్స్, నీమ్రానా హోటల్స్, ప్రైడ్ హోటల్స్ & రిసార్ట్స్, రోజేట్ హోటల్స్ & రిసార్ట్స్, రాయల్ ఆర్కిడ్ హోటల్స్, సరోవర్ హోటల్స్ & రిసార్ట్స్, సయాజీ హోటల్స్, హోటల్ సోనార్ బంగ్లా, స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్స్, తాజ్ హోటల్స్, ది లీలా ప్యాలెసెస్, హోటల్స్ అండ్ రిసార్ట్స్, ది పోస్ట్‌కార్డ్ హోటల్, విండమ్ హోటల్స్ & రిసార్ట్స్ వంటి భారతీయ, అంతర్జాతీయ గొలుసుసంస్థలు.

·       హోమ్‌స్టేలు, విల్లాలు, అపార్ట్‌మెంట్‌లు:  అమా స్టేస్ & ట్రైల్స్, ది బ్లూ కైట్, ఎలివాస్, గోస్టాప్స్, ది హాస్టలర్, లోహోనో స్టేస్, మస్టాష్, సాఫ్రాన్‌స్టేస్, స్టేవిస్టా, జోస్టెల్.

·       బ్యాంకులు: యాక్సిస్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, యస్ బ్యాంక్.

 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్