తాండూరులో బీసీ సంఘం కన్వీనర్‌ రాజ్‌ కుమార్‌ పుట్టినరోజు వేడుకలు

– పలు గ్రామాలు, తాండూర్‌ పట్టణంలో సేవా కార్యక్రమాలు
– పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించిన యువత, మహిళలు
నవతెలంగాణ-తాండూరు
బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గం కన్వీనర్‌ రాజ్‌ కుమార్‌ పుట్టినరోజు వేడుకలను శనివారం తాండూర్‌ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ని రంతరం బడుగు, బలహీన వర్గాల కోసం వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం పోరాడే నాయకుడిగా సామా జిక బాధ్యతున్న వ్యక్తి. వికారాబాద్‌ జిల్లా తాండూరులో బీసీ ఉద్యమ నేతగా పేరు పొందిన జాతీయ బీసీ కార్యవర్గ స భ్యులు తాండూర్‌ నియోజవర్గ బీసీ సంఘం కన్వీనర్‌ రాజ్‌ కుమార్‌ కందుకూరి జన్మదిన వేడుకలు మిత్రులు శ్రేయో భిలాషులు యువకులు బీసీ సంఘం నాయకులు మహిళా సంఘం నాయకుల ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలో ప లు వార్డుల్లో పెద్దేముల్‌, బషీరాబాద్‌, తాండూరు, యాలా ల మండలాల్లో పలు గ్రామాల్లో యువకులు రాజ్‌కుమార్‌ పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడంతో పాటు ప లు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తాండూరు మాత శిశు ఆస్పత్రిలో రాము ముదిరాజ్‌ మిత్ర బృందం ఆధ్వర్యం లో అల్పాహారం, పండ్లు పంపిణీ చేశారు. మహిళా ఉపాధ్య క్షురాలు అనితరాజ్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌ గృహకల్పలోని అంగన్‌వాడీ విద్యార్థులకు టిఫిన్‌ బాక్స్లు పంపిణీ చేశారు. పెద్దముల్‌ మండలాధ్యక్షులు శ్రవణ్‌ ఆధ్వర్యంలో విద్యా ర్థులకు నోటు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేశారు. యువ కులు పెద్దఎత్తున రాజ్‌ కుమార్‌ పుట్టినరోజు వేడుకలను ఒక పండుగల నిర్వహించారు. యువకులు తాండూరు ప్రాంతంలో పలుచోట్ల రాజ్‌కుమార్‌కు జన్మదిన శుభాకాం క్షలు తెలుపుకుంటూ బ్యానర్లు ఏర్పాటు చేశారు కేకులు కట్‌ చేయడం స్వీట్లు పంచుకోవడం పలు సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తాండూరు పట్టణంలో విశాల్‌ మార్ట్‌ దగ్గర ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా డాక్టర్‌ సంపత్‌ కుమార్‌ పాల్గొని కేక్‌ కట్‌ చేసి రాజ్‌ కుమార్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్‌ సుకుర్‌, తట్టేపల్లి పీఎసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ అంజయ్య ముదిరాజ్‌, వీరేశం, పట్టణ మహిళా అధ్యక్షురాలు నాయకుడు జ్యోతి, ఉపాధ్య క్షురాలు అనితరాజ్‌, బీసీ సంఘం మండలాల అధ్యక్షులు నరేందర్‌, బసంత్‌ కుమార్‌, మీడియా ఇన్‌చార్జ్‌ బసవరాజ్‌, నాయి బ్రాహ్మణ సమాజం నాయకులు పరమేశ్వర్‌, కుమ్మరి సమాజం నాయకులు అంజన్న, రవీందర్‌, పాండు బీసీ సంఘం యువ నాయకులు రాము ముదిరాజ్‌, జంటుపల్లి వెంకట్‌, హరి ప్రసాద్‌, దుబారు వెంకట్‌, పాండుగౌడ్‌, అనిల్‌, శివ, సాయి, ఎల్లప్ప, పలు కుల సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love