నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి (స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ యూనియన్ లిమిటెడ్ చైర్మన్) పుట్టినరోజు సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరద బట్టు వేణు రాజ్ ఆధ్వర్యంలో శంభుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, మల్లిక, అపర్ణ, బీసీ సెల్ అధ్యక్షులు రాజ నరేంద్ర గౌడ్, మాజీ కార్పొరేటర్ కేశ మహేష్ వాళ్లతో కలిసి తో కలిసి జిల్లా కాంగ్రెస్ భవన్ లో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం రామర్తి గోపి, వరదబట్టు వేణు రాజ్లు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నిబద్ధతతో పనిచేసే అధిష్టానం దృష్టిలో సమర్థవంతమైన నాయకుడిగా పేరు సంపాదించడమే కాకుండా ఇటు కార్యకర్తల పట్ల ఎల్లవేళలా బాధ్యతతో వ్యవహరిస్తూ కార్యకర్తలకు ఎటువంటి సమస్య వచ్చిన వారి వెన్నంటే ఉంటూ ఎల్లవేళలా వారిని ప్రోత్సహిస్తూ జిల్లాలో పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకొని పార్టీని ముందుండి నడిపించాడని వారు అన్నారు. భవిష్యత్తులో మానాల మోహన్ రెడ్డి గారు మరింత ఉన్నత స్థానంలో ఉండాలని దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అదేవిధంగా వరద బట్టు వేణు రాజ్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ గడుగు రోహిత్ మరియు నగర మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రీతం సమక్షంలో రెడ్ క్రాస్ సొసైటీలో మానాల మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విద్యార్థుల చేత రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గడుగరోహిత్ ప్రీతం, వేణు రాజ్ మాట్లాడుతూ.. మానాల అడవుల్లో మారుమూల ప్రాంతంలో పుట్టి నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర సొసైటీ యూనియన్ చైర్మన్ వరకు సాగిన మోహన్ రెడ్డి అన్నగారి ప్రయాణం మాలాంటి యువ నాయకులందరికీ ఆదర్శమని, మారుమూల పల్లెలో పుట్టి రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదగడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని ఎంతో కృషి పట్టుదల ప్రజలకు సేవ చేయాలనే జిజ్ఞాస ఉంటే తప్ప ఈ స్థాయికి రారని నూతనంగా రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకునే యువ నాయకులకు మానాల మోహన్ రెడ్డి గారి ప్రస్థానం ఒక పుస్తకం వంటిదని, అధిష్టానం ఎలాంటి పని అప్పచెప్పిన యువకుడిలా ముందుండి పార్టీ కార్యకలాపాలను సమర్ధవంతంగా నిర్వర్తించి మంచి పేరు సంపాదించి మాలాంటి యువ నాయకులకు ఎల్లవేళలా స్ఫూర్తిదాయకంగా మానాల మోహన్ రెడ్డి నిలుస్తున్నారని వారు అన్నారు.మానాల మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని భవిష్యత్తులో ఆయన తప్పకుండా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తారని వారు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో. కాంగ్రెస్ నాయకులు , ఎన్ ఎస్ యు ఐ నాయకులు సాయి కిరణ్, హరీష్, పోచమ్మ గల్లి శివ, మాధవ్, కౌశిక్, నరందీప్, సిల్క్ శివ,50 డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ అవిన్, శోభన్, కిషోర్, భీమ్గల్ శేఖర్, నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు.