– అల్పాహారం పంపిణీ
నవతెలంగాణ – సత్తుపల్లి
బీఆర్ఎస్ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్ జన్మదిన వేడుకలను పట్టణ బీఆర్ఎస్ నాయకులు, ఆయన అభిమానులు శుక్రవారం సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించారు. పాత సెంటర్ లోని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, పట్టణ బీఆర్ఎస్ నాయకుడు వీరపనేని అప్పారావు (బాబీ) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కూసంపూడి మహేష్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు అల్పాహారం పంపిణీ చేశారు. బస్టాండ్ రింగ్ సెంటర్ లో ప్రజలు, ప్రయాణికులకు అల్పాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు పాషా, బెల్లంకొండ రాములతో పాటు నాయకులు మోరంపూడి ప్రభాకర్, నరుకుళ్లు శ్రీను, అమరవరపు కృష్ణారావు, చింతల సురేందర్ రెడ్డి, చాంద్ పాషా, వల్లభనేని పవన్, పర్వతనేని వేణు, అయూబ్ పాషా, గుండ్ర రఘు, గాదె సురేష్, యాసా రాంబాబు, తడికమళ్ల ప్రకాశరావు, నడ్డి ఆనందరావు, మారుతి సూరిబాబు, కొప్పుల అప్పారావు, గుంజి వెంకటేశ్వరరావు, తూత జగన్మోహనరావు, మేకల నరసింహారావు, అక్షింతల చంటి, శ్రవణ్, వెదుళ్ల నాగు, షేక్ సుభాని, షేక్ బాబు, రామిశెట్టి కృష్ణ, అజార్, చల్లపల్లి సాంబ, క్లబ్ వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ విజయ్, కృష్ణ, చింతనిప్పు బాబూరావు, షేక్ జిన్నీ, పంతంగి సాంబ తదితరులు పాల్గొన్నారు.



