మండల కేంద్రంలో శనివారం రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ నాయకుడు, స్థానిక సింగిల్ విండో డైరెక్టర్ రేంజర్ల మహేందర్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను రేంజర్ల మహేందర్ చేత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వయంగా కట్ చేయించి, కేక్ తినిపించారు. ఈ సందర్భంగా మహేందర్ కు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తన చేత స్వయంగా కేక్ కట్ చేయించడం పట్ల జన్మదినం జరుపుకున్న రేంజర్ల మహేందర్ సంతోషం వ్యక్తం చేశారు. తన జన్మదిన వేడుకలు నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజా గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఏనుగు గంగారెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మైలారం సుధాకర్, అంగరి రాజేశ్వర్, మాజీ సర్పంచ్ గడ్డం స్వామి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.