వాషింగ్టన్ : క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ మళ్లీ పుంజుకుంటుంది. తాజాగా 40వేల డాలర్లకు చేరింది. గతేడాది మే తర్వాత బిట్ కాయిన్ పెరగడం ఇదే తొలిసారి. వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల ఆంక్షలు, ప్రభుత్వాల కఠిన నిర్ణయాలతో 2022లో బిట్ కాయిన్ భారీగా పతనాన్ని చవి చూసింది. ఇక ముందు కీలక వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉండకపోవచ్చునని యుఎస్ ఫెడ్ రిజర్వు ప్రకటనకు తోడు ద్రవ్యోల్బణం కూడా కాస్త దిగి రావడంతో వచ్చే ఏడాది వడ్డీరేట్లలో కోత విధిస్తామని పేర్కొనడం బిట్ కాయిన్ పుంజు కోవడానికి మద్దతునిచ్చిందని నిపుణులు భావిస్తున్నారు. ఇంతకుముందు 2021 నవంబర్‌లో బిట్ కాయిన్ దాదాపు 69 వేల డాలర్ల ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుంది.