కుల, మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్ధిపొందాలని బీజేపీ ప్రయత్నం

– ఇవి దేశ ఐక్యత కోసం  జరగబోయే ఎన్నికలు
– కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, మా సిఎం రేవంతే
– కాంగ్రెస్ లో గ్రూప్ లు.. ఏకనాథ్ షిండేలు లేరు
– హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి లు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది
– మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు 
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
కుల, మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్ధిపొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు జరగబోయేవి ఆశమాషి  ఎన్నికలు కావు. దేశ ఐక్యతకు కోసం జరిగే  ఎన్నికలు. కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. మా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు. అందరూ సీఎం నాయకత్వంలోనే పనిచేస్తున్నాం. అని రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రంజాన్ పండుగను  పురస్కరించుకొని మాజీ మంత్రి కుందురు జానారెడ్డి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ల  తో కలిసి నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కార్యకర్తలు, అభ్యర్థులు లేక హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి అనవసరపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏమాత్రం ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని, మాట్లాడేటప్పుడు విజ్ఞతతో మాట్లాడాలని హితవు  పలికారు.కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండేలు, గ్రూపులు లేవు. ఏకనాథ్ షిండే ను సృష్టించిందే బీజేపీనే. మహారాష్ట్రలో ఎన్సీపీని, శివసేనను చీల్చి ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మీరు కాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి లు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే నేను దేనికైనా సిద్ధం. మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.బండి సంజయ్ ను ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొడతామన్న మాటలు బంద్ చేయాలని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగాక ఆ ప్రభుత్వమే ఐదేళ్లు అధికారంలో ఉంటుంది. 50 ఏళ్ల మా పాలనలో ఏ పార్టీని పడగొట్టలేదు. దళితులను అవమానపరిచింది మీరే.  రాబోయే ఎన్నికల్లో 14 సీట్లు మేమే గెలవబోతున్నాం. నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు  రఘువీర్ రెడ్డిని కుల, మతాల కతీతంగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏది ఏమైనా ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. ఇప్పటికే కొన్ని పథకాల అమలు, ఎన్నికల కోడ్ ముగిశాక మిగతా పథకాలు అమలు చేస్తామని తెలిపారు.
Spread the love