నవతెలంగాణ – కంఠేశ్వర్
పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ని అవమానించిన బిజెపి నాయకులు అంబేద్కర్ విగ్రహాన్ని వారి పాపపు చేతులతో తాకినందుకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నుండి గ్రామ స్థాయి బిజెపి కార్యకర్త వరకు అంబేద్కర్ ను అవమానించి, అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ గురించి అవకులు చెవాక్కులు మాట్లాడితే ప్రధానిగా మోడీ మందలించలేదని,అంబేద్కర్ పేరు కంటే దేవుడి పేరును తలుచుకుంటే పుణ్యం వస్తుంది అని అమిత్ షా అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడిన తీరు దేశం మొత్తం చూసిందని, నిజానికి అంబేద్కర్ సబ్బండ వర్గాల ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చారని, అందుకే దేవుడు లాంటి అంబేద్కర్ పేరును జపం చేస్తారు అని, ఆయన చేసిన సేవలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ప్రజలు ముందుకు వెళ్తున్నారని ఆయన అన్నారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ అని,అమిత షా పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని, దీనివల్ల బీజేపీ కి అంబేద్కర్ పై చితశుద్ధి లేదు అని అర్థమవుతుంది అని అన్నరు. హత్యచేసిన వారే సానుభూతి తెలిపినట్టు రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలు శుద్ధి చేశారు అని, సిగ్గుండాలి బిజెపి నాయకులకు అంబేద్కర్ విగ్రహాలను తాకినందుకు,బీజేపీ నాయకుల పాపపు చేతులతో అంబేద్కర్ ను తాకారు.కావున అంబేద్కర్ కు వారి పాపలు తలకూడదని అంబేద్కర్ విగ్రహ శుద్ధి చేయడం జరిగింది అని అన్నారు.
బీజేపీ అంబేద్కర్ ను తక్కువ చేసి చూపే ప్రయత్నాన్ని తిప్పి కొడతాం అని, జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని గ్రామగ్రామాన ముందుకు తీసుకెళ్తూ అంబేద్కర్ ఆశయాలను వివరిస్తామని,బీజేపీ తీరును కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది అని అన్నారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ మాట్లాడుతూ ప్రజలను బీజేపీ మోసం చేయాలని చూస్తుంది అని.దానీ అందరూ గమనిస్తున్నారు అని ప్రపంచ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి చేసుకుంటున్నా సందర్భంలో ప్రధాన మంత్రి పార్లమెంటులో అంబేద్కర్ కి శ్రద్ధాంజలి ఘటించలేదు అని,కానీ ఈ రోజు హర్యానాలో బీజేపీ చేస్తున్న ప్రచారం పాల్గొన్నారని దీని బట్టి బిజెపి కు అంబేద్కర్ పై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుంది అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలను తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం బిజెపి చేస్తుంది అని,అందుకే బీజేపీ కి సీట్లు తగ్గాయి అని,రాబోయే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ మైనారిటీల ఐక్యతతో దేశ ప్రజలకు మోడీ జవాబు చెప్పాలి అని అన్నారు. ఎందుకు మోడీ ప్రధానిగా అంబేద్కర్ కు నివాళులు అర్పించలేదు చెప్పాలని,రాజ్యాంగాన్ని అవమానిస్తునా బిజెపి నాయకులు తీరును ఖండిస్తున్నామన్నారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు మాట్లాడుతూ.. పార్లమెంటు లో అంబేద్కర్ ను అవనించిన అమిత్ షా మాటలు కండిస్తూ, బీజేపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలను తాకి పాపం చేసినందుకు ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి శుద్ధి చేయడం జరిగింది అని, రాజ్యాంగాన్నీ మార్చి అంబేద్కర్ పేరును రూపుమాపాలని బీజేపీ కుట్ర చేస్తుంది అని, మహనీయుల త్యాగాన్ని పిల్లలు బోధించి వారి ఆశయాలు ఆలోచనలు ముందుకు తీసుకు వెళ్లాలని ఆయన అన్నారు.బీజేపీ అహంకారపూరిత పనులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలోరాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు, నుడా చైర్మన్ కేశ వేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్,జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంత రెడ్డి రాజా రెడ్డి,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్,రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,జిల్లా sc సెల్ అధ్యక్షులు లింగం, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,విజయ్ పాల్ రెడ్డి,సుమన్, వినోద్ బోటి,సంగెం సాయిలు,కేశ మహేష్,సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.