ఢిల్లీలో ఎంపీని కలిసిన బీజేపీ మండల నాయకులు

నవతెలంగాణ-తొగుట
మెదక్ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన రఘు నందన్ రావుకు శుభాకాంక్షలు తెలిపామని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరెడ్డి గారి విభీషణ్ రెడ్డి ప్రకటన ద్వారా తెలిపారు. మంగళవారం ఢిల్లీలో రఘునందన్ రావు మెదక్ ఎంపీగా ప్రమాణ స్వీకా రం చేసిన అనంతరం వెస్టన్ కోర్టులో మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి శుభాకాం క్షలు తెలిపారు. అనంతరం ఆయన ప్రకటన ద్వారా తెలిపిన వివరాల ప్రకారం ఎంపీ శ్రమ, కార్యకర్తల కష్టం వృధాగా పోలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి చేసేవాళ్లకు అంతా మంచే జరుగుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు ఓడిపోయిన ప్రస్తుతం మెదక్ పార్లమెంట్ స్థానంలో భారీ మెజార్టీతో విజయం సాధించడం గర్వకార ణం అన్నారు. రఘునందన్ రావు ఎంపిగా ఢిల్లీలో ప్రమాణస్వీకారం చేయడం చాలా సంతోష కర మని అన్నారు. భవిష్యత్తులో మంచి హోదాకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూమని చెప్పారు. ఈ గెలుపునకు కారణమైన మెదక్ ప్రజ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తొగుట మండల ఉపాధ్యక్షులు ఐలి గొండ చంద్రశేఖర్ గౌడ్, సిద్దిపేట జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు దాసరి కళ్యాణ్ దాస్, చందాపూర్ మాజీ సర్పంచ్ బొడ్డు నర్సింలు, గుడికందుల మాజీ ఉపసర్పంచ్ మల్లు గారి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love