చండూర్ లో బీజేపీ కార్యాలయం ప్రారంభం 

నవతెలంగాణ – చండూరు  
చండూరు మున్సిపల్ పట్టణంలో  బీజేపీ కార్యాలయాన్ని  ఆ పార్టీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ఆ  పార్టీ  జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం   వర్షిత్  రెడ్డి తో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీగా ఉన్నప్పుడు  భువనగిరి నియోజకవర్గంలో  నవరత్నాలు అనే పేరుతో  భువనగిరి నియోజకవర్గం అంతా  పలు అభివృద్ధి పనులు చేపట్టానని తెలిపారు. పార్టీ నేతలు అంతా సమిష్టిగా ఉండి  తన గెలుపు కృషి చేయాలని కోరారు. నియోజకవర్గంలో  ఆగిపోయిన ప్రాజెక్టు పనులను  పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర  కార్యవర్గ సభ్యులు దోనూరు  వీరారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దూడల  బిక్షం గౌడ్, సోమ నరసింహ, కోమటి వీరేశం,దాసరి మల్లేశం, మండల అధ్యక్షులు ముదిగొండ   ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్,  బోడ ఆంజనేయులు, దూస గణేష్, బొబ్బిలి శివ, కాసాలా జనార్దన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love