కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగింపు..

– ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..
– సుల్తాన్ బజార్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ఎన్ రాంబాబు
నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
కార్లకు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం తొలగింపు స్పెషల్ డ్రైవ్ ను సుల్తాన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించారు. కోఠి లోని బ్యాంక్ స్టేట్ వద్ద కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్లింగ్ ను సుల్తాన్ బజార్ ట్రాఫిక్  ఇన్ స్పెక్టర్ రాంబాబు తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.‌.. కమిషనర్ ఆదేశాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఫోర్ వీలర్ వాహనాలు ఉన్న వాహనదారులు కార్ల అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ తొలగించుకోవాలని సూచించారు. వాహనదారులు వాహనాలకు నెంబర్ ప్లేట్స్ లేకుంటే చట్ట పరమైన చర్యలు తీసు కుంటామాని హెచ్చరించారు.  నంబర్ ప్లేట్స్ లేని వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ప్రతి వాహనానికి తప్పని సరిగా నెంబర్ ప్లేట్స్ బిగించు కోవాలని, వాహన దారులు తమ వెంట వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, వాహన ఆర్సీ, హెల్మెట్ తెచ్చు కోవాలని, మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై చర్యలు తీసు కుంటామని ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని సూచించారు. వాహనం నడిపేటప్పుడు సెల్ఫోన్ వాడకూడదు అన్నారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలకు గురై అవకాశం ఉందన్నారు. ఫోర్ వీలర్ వాహనదారులు సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ లు సుధాకర్. సోమశేఖర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love