బొడ్రాయి ముత్యాలమ్మ ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

నవతెలంగాణ – నూతన్ కల్
మండల పరిధిలోని  చిల్పకుంట్ల గ్రామంలో బొడ్రాయి ముత్యాలమ్మ దేవతల ప్రతిష్టాపన మూడవ వార్షికోత్సవ కార్యక్రమంలో తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామెల్ పాల్గొని ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మహిళలతో కలిసి ప్రదర్శనగా తీసుకొని వెళ్లి ముత్యాలమ్మ దేవతకు సమర్పించి బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కొంపెల్లి మల్లారెడ్డి  ఫార్మ్ హౌస్ లో నూతనంగా ఏర్పాటు చేసిన గొర్రె పిల్లల పెంపకం షేడ్ ను  ప్రారంభించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పరిపాలనలో ఇందిరమ్మ కలలు కన్నా పరిపాలన కొనసాగుతుందని ,సీఎం రేవంత్ ప్రవేశపెట్టిన అన్ని పథకాలు లబ్ధిదారులకు చేకూరేలాగా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు తీగల గిరిధర్ రెడ్డి కొంపెల్లి మల్లారెడ్డి, పగిళ్ల అశోక్ రెడ్డి కళ్ళం కృష్ణారెడ్డి, మండల సీనియర్ నాయకులు బాణాల సుదర్శన్ రెడ్డి పన్నాల మల్లారెడ్డి, ఎం వెంకట నరసింహారెడ్డి చిల్పకుంట్ల గ్రామ శాఖ అధ్యక్షుడు పెద్దింటి మోహన్ రెడ్డి, పంతం వెంకన్న బత్తుల నాగమల్లు, వెంకట నర్సు  బాణాల మల్లారెడ్డి పులుసు సైదులు, సింగిల్ విండో చైర్మన్లు బండ సోమిరెడ్డి బాణాల సత్యనారాయణ రెడ్డి పులుసు రవి కూసు వెంకన్న బిక్కి శ్రీనాథ్ సురేష్ రామసాని నర్సిరెడ్డి బత్తుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love