నవతెలంగాణ – కంఠేశ్వర్
అదృశ్యమైన వ్యక్తి మంగళవారం శవమై తేలిన ఘటన నగరంలోని ఐదవ టౌన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని సాయి నగర్ కు చెందిన అరిగేలా గంగారం(65) ఆదివారం నగరంలో ఊర పండగ సందర్భంగా సాయంత్రం సమయంలో బయటకు కు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళాడు. రాత్రి అయిన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ ఆచూకీ కోసం కుటుంబీకులు వెతికారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే 5వ పోలీస్ స్టేషన్ పరిధిలో వర్షం నీటితో నిండిన కుంటలో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.