ఎఫ్‌డీలపై బీఓఐ వడ్డీ రేట్ల కోత

BOI cuts interest rates on FDsహైదరాబాద్‌ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించింది. ఇప్పటికే 400 రోజుల ఎఫ్‌డీ స్కీమ్‌ను వెనక్కి తీసుకున్న బీఓఐ తాజాగా మిగితా ఎఫ్‌డీలపై వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది. ఇది 15 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 25 బేసిస్‌ పాయింట్లు (పావు శాతం) వరకు వడ్డీ రేటును తగ్గించినట్లు బీఓఐ వెల్లడించింది. దీంతో 91-179 రోజుల ఎఫ్‌డిపై వడ్డీ 25 బేసిస్‌ పాయింట్లు తగ్గి 4.25 శాతానికి చేర్చింది. 180 రోజుల నుంచి ఏడాది కాలపరిమితి ఎఫ్‌డీపై 5.75 శాతానికి, 1-2 ఏండ్ల ఎఫ్‌డీలపై వడ్డీని 6.75 శాతంగా నిర్ణయించింది.

Spread the love