Sunday, May 10, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపోలీస్ వాహ‌నంపై బాంబు దాడి..15మంది మృతి

పోలీస్ వాహ‌నంపై బాంబు దాడి..15మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: పాకిస్థాన్ లో పోలీస్ పోస్ట్, వాహనంపై జరిగిన వరుస కారు బాంబు దాడుల్లో సుమారు 15మంది మరణించారని ఉన్నతాధికారులు ఆదివారం తెలిపారు. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వాయువ్య పాకిస్థాన్ లోని ఒక పోలీస్ పోస్ట్ వద్ద, ఆ తర్వాత సహాయం అందించేందుకు వెళ్తున్న పోలీస్ సిబ్బంది వాహనంపై మెరుపు దాడులు జరిగాయని అన్నారు. ధ్వంసమైన పోలీస్ అవుట్ పోస్ట్ నుండి 12మంది అధికారుల మృతదేహాలను వెలికితీశామని, తీవ్ర గాయాలైన మరో ముగ్గురిని ఆస్ప్రతికి తరలించామని పోలీస్ అధికారి సజ్జాద్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉగ్రవాదులు మొదట పేలుడు పదార్థాలతో నిండిన కారుతో పోలీస్ పోస్ట్ ను ఢీ కొట్టారని, అనంతరం ప్రాంగణంలోకి ప్రవేశించి, అధికారులపై కాల్పులు చేపట్టారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. సహాయం అందించేందుకు పంపిన అధికారులపై కూడా మెరుపు దాడి చేశారని అన్నారు. ఈ దాడిలో ఉగ్రవాదులు డ్రోన్లను వినియోగించారని పేర్కొన్నారు. ఇత్తెహాద్-ఉల్ -ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -