నవతెలంగాణ – కంటేశ్వర్
హైదరాబాదులోని ఫతే మైదాన్ క్లబ్ లో నూతనంగా ఎమ్మెల్సీగా ఎంపికైన నిజామాబాద్ జిల్లా బీసీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి శనివారం ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పొన్నం ప్రభాకర్ గౌడ్, వీ హెచ్ హనుమంతరావు ఆకుల లలిత రాఘవేందర్, బీసీ రాష్ట్ర నాయకులు జాజుల శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ బిసి సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాఘవేందర్,నిజాంబాద్ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ బొబ్బిలి నరసయ్య తదితరులు బీసీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీలంతా ఒక తాటిపైకి రావడానికి నిజామాబాద్ జిల్లాలో త్వరలో భారీ ఎత్తున మేమెంతో మాకంత అనే నినాదంతో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని నిర్ణయించడం జరిగింది. ఈ సభకు రాష్ట్ర బీసీ మంత్రులు, జాతీయ బీసీ నాయకులు రావడం జరుగుతుంది . ఈ సభని రాష్ట్రంలోని బీసీ నాయకులు బిసి సోదర సోదరీమణులు అందరూ విచ్చేసి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కెంపుల నాగరాజు, ప్రధాన కార్యదర్శి ఎనుగందుల మురళి,తెలంగాణ బిసి సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే గణేశ్, బిసి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్, బిసి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి శివకుమార్ ముదిరాజ్, నిజామాబాద్ నగర అధ్యక్షులు రతన్, మహిళ అధ్యక్షురాలు స్వప్న, నాయకులు రాజా గౌడ్, గడిల రాములు, బంటు బలరాం, కపిల్, నందు, ప్రభాకర్, రాందాస్, ఇతర నాయకులు పాల్గొన్నారు.