ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఘనంగా బోనాలు

Bona in the Government General Hospital– నెత్తిన బోనమెత్తిన డా. ప్రతిమ రాజ్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ప్రతి ఏడాది ఆషాడమాసంలో నిర్వహించే బోనాలను ఈ సంవత్సరం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రతిమ రాజ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డా. ప్రతిమరాజ్ సూపరింటెండెంట్ బోనం ఎత్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లోని బంగారు మైసమ్మ అమ్మవారికి వస్త్రాలు, ఒడి బియ్యం  లాంఛనాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాంప్రదాయకరంగా మన పండుగలను నిర్వహించి మన సంస్కృతిని కాపాడాలని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లోని బంగారు మైసమ్మ అమ్మవారు చాలా శక్తి కలదని, మొక్కిన మొక్కులు తప్పక తీర్చే అమ్మవారు అని ఆమె అన్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా ఆనందదాయకంగా ఉందని తెలిపారు. ఆ దేవత దయవలన ప్రజలందరూ సుఖ సంతోషాల తో ఆయురారోగ్యైశ్వర్యముల తో వర్ధిల్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
Spread the love