– జెడ్పిహెచ్ఎస్ పెద్దవూర ఉన్నత పాఠశాలలో
– పది విద్యార్థుల వీడ్కోలు సమావేశం
నవతెలంగాణ – పెద్దవూర : ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడిపోమంటూ స్టూడెంట్ నంబర్ వన్ సినిమాలో తలపించేలా మండలం లోని పెద్దవూర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం,పాఠశాల వార్షికోత్సవ వేడుకలు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ తరిరాము ఆధ్వర్యంలో మాజీ జెడ్పి వైస్ ఛైర్మెన్ కర్నాటి లింగారెడ్డి, హాలియా మార్కెట్ ఛైర్మెన్ తుమ్మపల్లి చంద్రశేఖర్ రెడ్డి, సోమవారం చదువుల తల్లి సరస్వతి దేవీకి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభిచారు. ఈసందర్బంగా మాట్లాడుతూ పది ఫలితాల్లో ప్రతి ఒక్కరూ 10 జీపీఏ సాధించి వెల్మగూడెం జెడ్పి హెచ్ ఎస్ స్కూల్‌ను ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుపాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికి స్నేహాపూర్వకంగా ఉండడం ఎంతో శుభసూచకమని అన్నారు. సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు.ప్రతి సంవత్సరం చాలా మంది విద్యార్థులు ఈ స్కూల్ నుంచి వెళ్తూ ఉంటారని ఎంతోమంది ఉత్తీర్ణత సాధించి మంచి మార్కులతో మంచి ర్యాంకులు తీసుకొచ్చే విధంగా కృషిచేస్తున్నామన్నారు. విద్యార్థులు అందరూ పరీక్షలన్నీ ముగించుకొని వారు వెళుతూ ఉంటే తమకు చాలా బాధగా ఉoదని విద్యార్థుల మీద వారి ప్రేమను వ్యక్తపరిచారు. అలాగనే విద్యార్థులు వారి ఉపాధ్యాయులపై ఎంతో కాలం నడిచిన ఈ అనుబంధాన్ని మరవలేక పోతున్నామని ఎంత స్థాయికి వెళ్లిన తమ గురువుల్ని గుర్తుపెట్టుకుని గురువులను తల ఎత్తుకునే విధంగా గొప్ప స్థాయికి వెళ్తామని విద్యార్థులు తెలియజేశారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లలకు మంచి పునాది ఇవ్వడంలో100 శాతం కృషి చేశామని వారు గొప్పఎత్తులకు ఎదిగి తమ పేరుని నిలబెట్టాలని ఆశాభావం వ్యక్తపరిచారు .అనంతరం నృత్యాలతో, గీతాలతో, స్లామ్ పుస్తకాలతో, ఒకరికొకరు ఉండిపోయేలా విద్యార్థులు తమ తమ భావాలను వ్యక్తపరచుకున్నారు.విద్యార్థు