Thursday, July 2, 2026
E-PAPER
Homeజాతీయంతల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్‌లు..పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా..?

తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్‌లు..పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా..?

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులిద్దరూ ఐఏఎస్‌లు అయితే వారి పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా అని ప్రశ్నించింది. సామాజికంగా, ఆర్థికంగా ముందుకు వచ్చిన కుటుంబాలు పదే పదే కోటా ప్రయోజనాలు పొందడం అవసరమా అన్న సుప్రీంకోర్టు.. రిజర్వేషన్ల ద్వారా సామాజిక స్థితిలో మార్పు సాధించిన కుటుంబాలు రిజర్వేషన్ వ్యవస్థ నుండి బయటకు రావాలి’అని స్పష్టం చేసింది

రిజర్వేషన్లలో కొనసాగితే ఈడబ్ల్యూఎస్‌కు, క్రిమిలేయర్‌కు తేడా ఏముంటుంది?. ఆ రెండింటి మధ్య తేడా ఉండాల్సిందేనని తెలిపింది. ఓబీసీ క్రిమిలేయర్‌, రిజర్వేషన్లపై నమోదైన దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు జస్టిస్ బీవీ నాగరత్న,జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం రిజర్వేషన్లపై వ్యాఖ్యానించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -