- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జమ్మూకశ్మీర్‌లోని లేహ్(లద్దాక్)లో గురువారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.5 మ్యాగ్నిట్యూడ్‌గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు.
- Advertisement -



