Friday, May 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విఓఏల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

విఓఏల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

కొయ్యుర్లో నిరవధిక సమ్మె ప్రారంభం
నవతెలంగాణ – మల్హర్ రావు

తమ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని శుక్రవారం మండలంలోని ఐకెపి విఓఏ జాయింట్ యాక్టివ్ మండల (జెఏసి సెర్ప్) కమిటీ ఆధ్వర్యంలో 27 మంది విఓఎలు కొయ్యుర్ మండల సమాఖ్య కార్యాలయంలో ముందు నిరవధిక  సమ్మె ప్రారంభించారు. ఈ సందర్భంగా విఓఎలు మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర విఓఏ జెఏసి కమిటీ ఆదేశాల మేరకు శాంతియుత నిరవధిక సమ్మె చేపట్టినట్లుగా పేర్కొన్నారు. విఓఏ సమస్యలైన కనీస వేతనం రూ.20 వేలు, సెర్ప్ ఉద్యోగులు గా గుర్తించి హేఆర్ పాలసీ వర్తింపజేయాలని, అర్హులైన విఓఏలను సిసిలుగా పదోన్నతులు కల్పించాలని, సాధారణ ఆరోగ్య బీమా రూ.20 లక్షలు కల్పించాలని, ట్యాబు సౌకర్యం కల్పించాలని, 58 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అక్కల ప్రమీల, రోజా, శ్రీదేవి, లలిత, రజిత, స్వప్న, సృజన, సరితా, భవాని, జ్యోతి, ప్రియాంక, మానస, అంజలి, కళావతి, సునీత, కమ్మల రాజయ్య, భిక్షపతి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -