Wednesday, September 23, 2026
E-PAPER
Homeతాజా వార్తలురోడ్ పక్కన ముళ్లపొదల్లో శిశువు లభ్యం..

రోడ్ పక్కన ముళ్లపొదల్లో శిశువు లభ్యం..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : నిజామాబాద్ శివారులోని మోపాల్-సిర్పూర్ రోడ్ పక్కన ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఒక రోజు వయస్సున్న ఆడ శిశువును వదిలివెళ్లారు. బుధవారం మధ్యాహ్నం కూలీలకు పాప ఏడుపు వినిపించడంతో పోలీసులకు, 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది శిశువును మాతాశిశు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల పర్యవేక్షణలో పాప కోలుకుంటోంది. కొత్త టవల్స్‌లో చుట్టి పడేసిన శిశువు కుక్కల బారిన పడకుండా సురక్షితంగా బయటపడింది. మోపాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -