తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన దీపం

6 గంటల క్రితం

A lamp lit atop the hill of Tirupparankundram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న 'దీపత్తూన్' (దీప స్తంభం) వద్ద సాంప్రదాయ దీపాన్ని వెలిగించారు. ఆలయ నిర్వహణను పర్యవేక్షించేందుకు నియమితులైన రిటైర్డ్ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. వైద్యనాథన్, జస్టిస్ వి. పార్థిబన్ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కోసం, ఆలయ సిబ్బంది, భద్రతా సిబ్బంది, అధికారిక అనుమతి పొందిన 50 మంది భక్తులకు మాత్రమే కొండపైకి వెళ్లేందుకు అనుమతించారు. ప్రజల భద్రత, కొండ పవిత్రత , శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని, విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్