Magazines

స్కాట్లాండ్‌లో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు మృతి

1 గంట క్రితం

Fatal plane crash in Scotland.. two dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : స్కాట్లాండ్‌లోని గ్లాస్గో విమానాశ్రయ పరిధిలో శుక్రవారం తేలికపాటి విమానం ప్రమాదానికి గురైంది. స్టిర్లింగ్‌లోని డ్రైమెన్ గ్రామానికి ఈశాన్య దిశలో జరిగిన ఈ ఘటనలో 16 ఏళ్ల బాలుడు, 80 ఏళ్ల వృద్ధుడు మృతిచెందారు. సమాచారం అందుకున్న అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎయిర్‌ యాక్సిడెంట్స్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్రాంచ్‌ (ఏఏఐబీ) ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించింది. విచారణ పూర్తయ్యే వరకు ఆ ప్రాంతంలో డ్రోన్లు, విమానాల రాకపోకలపై అధికారులు తాత్కాలిక ఆంక్షలు విధించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్