నవతెలంగాణ-హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ఉన్నత న్యాయమూర్తులకు బహిరంగ లేఖ రాశారు. తన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో జైలులోనే మరణించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తనకు, తన భార్య బుష్రా బీబీకి సరైన వైద్య చికిత్స అందేలా చూడాలని ఆయన దేశంలోని అత్యున్నత న్యాయస్థానాల ప్రధాన న్యాయమూర్తులను కోరారు.అతని న్యాయవాది బారిస్టర్ సల్మాన్ సఫ్దర్ సోమవారం నాడు ఆ లేఖను Xలో పోస్టు చేశారు.
తనకు సరైన వైద్య చికిత్స అందడం లేదని ఆయన పేర్కొన్నారు.తన న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టు, ఫెడరల్ రాజ్యాంగ కోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు పంపిన బహిరంగ లేఖలో విషయం తెలియజేశారు.
సుదీర్ఘకాలం పాటు నిర్బంధంలో ఉండటం, తన మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపాయని , తన శిక్షను "క్రూరమైనది, అసాధారణమైనద" అని ఆయన అభివర్ణించారు. జైలులో ఉన్న తన భార్యతో సమావేశాలను రద్దు చేస్తున్నారని, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తన కుటుంబంతో మాట్లాడటానికి కూడా అనుమతించడం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
కాగా, 2023 ఆగస్టు నుండి రావల్పిండి జైలులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనతో పాటు భార్య బుష్రా బీబీ జైలు శిక్షను అనుభవిస్తోంది.







కామెంట్‌లు (0)