Magazines

హోర్ముజ్ జలసంధిలో కుప్పలు కుప్పలుగా ఐఫోన్లు

15 అక్టోబర్, 2026

Hormuz
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: హోర్ముజ్ జలసంధిలో ఐఫోన్లు, లగ్జరీ పెర్ఫ్యూం బాటిళ్లలతో కూడిన బాక్సులు కుప్పలు కుప్పలుగా తేలియాడాయి. యూఏఈకి చెందిన కార్గో నౌక 2500 కంటైనర్లతో బుధవారం హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తుండగా మైన్‌ను ఢీకొనడంతో నౌకలో మంటలు చెలరేగాయి. తర్వాత కొన్ని నిమిషాల్లోనే నౌక మునిగిపోయిన విషయం తెలిసిందే. ఆ నౌకలో ఉన్న కంటైనర్లలో ఉన్న బాక్సుల్లో కొన్ని మునిగిపోగా, మరికొన్ని తేలియాడాయి. కంటైనర్ల నుంచి బయటకు వచ్చిన ఐఫోన్లు, పెర్ఫ్యూం బాటిళ్ల బాక్సులు సముద్రంపై భారీగా తేలియాడాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి గురువారం వెలుగులోకి వచ్చింది. నౌక మునిగిపోయిన ప్రాంతం వద్ద ఐఫోన్లు, పెర్ఫ్యూం బాటిళ్లు వందల సంఖ్యలో తేలియాడుతున్న దృశ్యం ఆ వీడియోలో ఉంది. కొందరు చిన్నచిన్న బోట్లలో సముద్రంలోకి వెళ్లి వాటిని సేకరించిన ద‌ృశ్యాలు కూడా రికార్డయ్యాయి.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్